ఇంటికి వెళ్లి బంగారం అందజేత
ఏలూరు నగరంలో ఇటీవల చోరీలకు పాల్పడిన ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు వన్ టౌన్, త్రీ టౌన్ పరిధిలో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి అందజేశారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.