'ఆలయానికి వెళ్లే దారికి మరమ్మత్తు పనులు చేపట్టండి'
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే దారికి మరమ్మత్తు పనులు చేపట్టాలని సోమవారం గ్రామ గౌడ సంఘం నాయకులు, గ్రామ కార్యదర్శి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి 5 సవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎల్లమ్మ బోనాల పండగ జనవరి 2026లో నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా గుడివద్దకు వెళ్లే దారి గుంతలు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.