1,500 మందికి అన్నదానం

నెల్లూరు రూరల్ మండలంలో భక్తులకు సేవ చేయడంలో ఆనందం ఉందని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన 1,500 మందికి అన్నదానం చేశారు. వందేళ్లుగా తన కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.