గోదావరి జిల్లాల్లో 3 రోజులు పవన్ పర్యటన
AP: ఉభయ గోదావరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడురోజుల పాటు పర్యటించనున్నారు. ఎల్లుండి జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజోలు నియోజకవర్గం కేశనపల్లిలో చనిపోయిన కొబ్బరి చెట్లను ఈ నెల 26న పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. 29న కాకినాడ, పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.