'తొక్కిసలాట దుర్ఘటన మనసును కలిచివేసింది'
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మంత్రి సంధ్యారాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట దుర్ఘటన మనసును కలిచివేసిందని ఆవేదన చెందారు. దైవదర్శనానికి వెళ్లినప్పుడు ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించగా 13 మంది గాయపడిన విషయం తెలిసిందే.