ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ జారీ

ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ జారీ

భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని చుట్టూ 5000 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. పుతిన్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి.