ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మోటుపల్లిలో జరుగుతున్నఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీవో మహబూబ్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని తెలియజేశారు. వేసవికాలం నేపథ్యంలో ఉపాధి కూలీలందరూ ఉదయాన్నే పనికి రావాలని తెలియజేశారు. పని ప్రదేశంలో మంచినీళ్లు ఉంచుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.