VIDEO: 'గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'
SKLM: వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఏ పాఠకుడు చదవలేడని, గ్రంథాలయాలకు వెళ్లి ఆ పుస్తకాలు చదివి సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో మురళీకృష్ణ రావు అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం లావేరు శాఖా గ్రంథాలయములో వారోత్సవాలు ఆయన ప్రారంభించారు. తొలుత బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.