'సుస్థిర పాలన అందించడమే లక్ష్యం'

'సుస్థిర పాలన అందించడమే లక్ష్యం'

ASR: జిల్లాలో ప్రజలకు సుస్థిర పాలన, సత్వర సేవలు అందించడమే మన లక్ష్యమని కలెక్టర్ టీ.నిషాంతి పేర్కొన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ అందుబాటులో వారి వారి కార్యాలయాల్లో ఉండాలన్నారు. అలా లేనివారిపై శాఖాపరమైన తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.