నేడు మండలంలో రైతు కమిషన్ బృందం

NGKL: వంగూర్ మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో బుధవారం రైతు కమిషన్ బృందం పర్యటించనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పండిత్ రావు తెలిపారు. వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీన్ రెడ్డి హాజరుకానున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.