అలజంగిలో శివుడి ఆకారంలో మండపం ఏర్పాటు

VZM: చీపురుపల్లీ మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అలజంగి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శివుడి ఆకారంలో మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపం చూపరులను ఆకట్టుకొంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినూత్న మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.