నాణ్యమైన విత్తనాలు అందిస్తాం: కలెక్టర్

SRD: రాబోయే వర్షాకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విత్తనాలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. టీజీ సీడ్స్ విత్తన కేంద్రంలో ఆరు శాతం డిస్కౌంట్‌తో రవాణా ఖర్చులు లేకుండా గ్రామానికి విత్తనాలను అందిస్తామని చెప్పారు.