కో-ఆప్షన్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి:BRS
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ మెంబర్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరుతూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఇవాళ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ, కో-ఆప్షన్ ఎన్నికలు వాయిదా, ఇతర మున్సిపాలిటీల్లో ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తొర్రూరులో ఆలస్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.