'తాగునీటి సరఫరా కోసం కాల్ సెంటర్'

'తాగునీటి సరఫరా కోసం కాల్ సెంటర్'

BPT: పట్టణ శివారు, పైపులైన్ లేని ప్రాంతాల ప్రజలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కమిషనర్ రఘునాథరెడ్డి శుక్రవారం తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే లేదా ట్యాంకర్లు సకాలంలో రాకపోతే, వెంటనే పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ 9849908208కు ఫోన్ చేయాలన్నారు.