ఈనెల 7న నరసింహుని ఆలయం మూసివేత

ఈనెల 7న నరసింహుని ఆలయం మూసివేత

GNTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఈనెల 7న రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎగువ, దిగువ,ఉప ఆలయాలు మూసివేస్తారు. తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల తర్వాత గ్రహణ శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులను దర్శనానికి అనుమతిస్తారని ఆయన చెప్పారు.