బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి
SKLM: వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు MPP స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్రెషర్ కుక్కర్ పేలి ముగ్గురు వంట మనుషులకు తీవ్రమైన గాయాలు అయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఇవాళ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. గాయాల తీవ్రత గురించి వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.