'మోనికా' సాంగ్.. పూజా హెగ్డే ఆసక్తికర పోస్ట్

'కూలీ' మూవీలో మోనికా పాటలో నటి పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. ఆ పాటకు వస్తోన్న స్పందనపై పూజ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 'ఈ పాటను ఆదరిస్తోన్న వారందరికీ ధన్యవాదాలు. ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డా. కాలు బెణికినప్పటికీ ది బెస్ట్ ఇచ్చా. థియేటర్లలో చూసినప్పుడు ఇది అద్భుతంగా ఉంటుందని మాట ఇస్తున్నా. ఈ టాస్క్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన డ్యాన్సర్లకు థ్యాంక్యూ' అంటూ రాసుకొచ్చింది.