ఖజానా జ్యువెలరీ కేసు.. 900గ్రా. వెండి, తుపాకీ స్వాధీనం

ఖజానా జ్యువెలరీ కేసు.. 900గ్రా. వెండి, తుపాకీ స్వాధీనం

RR: చందానగర్ ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. గుజరాత్‌లో ప్రిన్స్ కుమార్ భారతి, రోహిత్ కుమార్ రజాక్ లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలు, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. జ్యువెలరీలో డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపింది రోహిత్ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.