ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 'పొట్టి శ్రీరాములు': ఎమ్మెల్యే
E.G: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కొవ్వూరులో ఆయన విగ్రహానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉనికిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారన్నారు.