పీవోకేలో మరోసారి నిరసనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. POKలోని విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా అక్కడి జెన్-Zలు నిరసనలు చేపట్టారు. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతీ 3-4 నెలలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాగే పలు పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. కనీసం పరీక్షలు రాయని వారు కూడా పాస్ అవుతున్నట్లు తెలిపారు.