VIDEO: ఈనెల 22న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో శ్రీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన సాయంత్రం 7 గంటలకు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. కాళికా పురాణ వజ్రానుసారం శివుడే స్వయంగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు.