జిల్లాలో సీనియర్ బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు

KNR: ఈనెల 11న సీనియర్ బేస్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని బేస్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షులు చల్ల హరిశంకర్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారులను ఈనెల 16 - 18 వరకు అదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో హాజరుకావాలన్నారు.