ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

సత్యసాయి: కొత్తచెరువు మండలం మైలేపల్లిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ధర్మవరం బోయ వీధికి చెందిన మంజునాథ్ (25), వేములేటిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (55) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.