కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం

కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం

KNR: ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావస్తున్నా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం భారీగా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. సమయానికి లారీలు రాకపోవడం, మిల్లర్లు కూడా ధాన్యాన్ని దించుకోవడానికి వెనకడుగు వేయడం దీనికి కారణం. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.