'నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు'
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రద్దు చేశారు. పంచాయతీ ఎన్నికలు, మాడల్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని ఆయన తెలిపారు.