సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: MLA
SKLM: మెలియపుట్టి మండలం ఆంపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక నాయకులతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.