నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
SKLM: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవ అధికారి సంస్థ కార్యాలయంలో ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులకు న్యాయం జరగేలా చూడాలని తెలిపారు.