జగన్ పాలనలో వృద్ధి రేటు పడిపోయింది: నజీర్

జగన్ పాలనలో వృద్ధి రేటు పడిపోయింది: నజీర్

కృష్ణా: పాలనాపగ్గాలు సమర్ధుడైన నాయకుడి చేతిలో ఉంటే 2014-19 మధ్య కాలంలో మాదిరిగా ప్రగతి పరుగులు తీస్తుందని, లేదంటే చతికిల పడిపోతుందని టీడీపీ నేత బెజవాడ నజీర్ అన్నారు. గురువారం ఆయన పటమటలో మాట్లాడుతూ.. జగన్ పాలనలో వృద్ధి రేటు పడిపోవడం వల్ల సుమారు రూ.7 లక్షల కోట్ల జీఎస్‌డీపీ నష్టపోయామని, అలాగే రాష్ట్రానికి రూ.76,195 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని ఆరోపించారు.