బీహార్ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు
AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బీహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 'బీహార్ రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయ నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని 99 సంవత్సరాలపాటు రూ.1 టోకెన్ లీజ్ రెంట్‌పై కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.