VIDEO: తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి

WGL: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందిన ఘటన సోమవారం వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజుల అనిల్ గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారి కిందపడి మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు జనశ్రీ, సిద్ధేశ్వరి ఉన్నారు