'రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి'
BDK: పాల్వంచ మండలంలోని రంగాపురం గ్రామ పంచాయతీ శివారులోని కిన్నెరసాని వంతెనపై ఏర్పడిన గుంతలను ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ గుంతలు ప్రధాన రహదారిపై ఏర్పడడంతో ప్రమాదాలు నివారణకు తక్షణమే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు. వారితోపాటు పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఇంఛార్జ్ ఎంపీవో చెన్నకేశవ ఉన్నారు.