పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హోమం
కృష్ణా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళ మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ కోసం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.