గూడెం దేవాలయంలో ప్రత్యేక పూజలు

MNCL: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు త్వరగా కోలుకోవాలని లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు దండేపల్లి మండలంలోని శ్రీ గూడెం గుట్ట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం వారు దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమేష్ ఉన్నారు.