'మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ప్రకాశం: వినాయక నిమజ్జనంపై పామూరు సీఐ కార్యాలయంలో శనివారం విగ్రహ నిర్వాహకులతో సీఐ భీమా నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం వినాయక మండపం ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మించుకునే విధంగా చూడాలని తెలిపారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు