నిమ్మాడలో గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి
SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గంలో పాటు శ్రీకాకుళం జిల్లాలో కల నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. నేరుగా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు.