VIDEO: రైతులకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం

ప్రకాశం: రైతులకు ఏ కష్టం రాకుండా ఎన్డీఏ కూటమి వెన్నుదన్నుగా నిలుస్తుందని కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాసులు అన్నారు. హనుమంతునిపాడులో రైతులకు ఎమ్మెల్యే ఉగ్ర సహకారంతో సోమవారం గొడుగులను ఏఎంసీ ఛైర్మన్ పంపిణీ చేశారు. రైతులకు నియోజకవర్గంలో ఎక్కడ ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడిఏ జైనులాబ్దిన్ పాల్గొన్నారు.