రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం

కృష్ణా: ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు సోమవారం నుంచి 7 రోజుల పాటు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరంలోని లయోలా కళాశాలలో ఈ శిక్షణ ఉంటుందని AMO శ్యాంసుందర్ తెలిపారు. ఒక్కో బృందంలో 50 మంది ఉపాధ్యాయులకు, మొత్తంగా 14 విడతలలో న్యూమరసీ, ఫౌండేషన్& లిటరసీపై శిక్షణ ఇస్తామన్నారు.