'బీఆర్ఎస్ హయంలోనే గ్రామీణ క్రీడలకు పెద్దపీట'
SRCL: బీఆర్ఎస్ హయంలోనే గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య అన్నారు. మండలంలోని క్రీడాకారులకు జెర్సీలను స్థానిక నాయకులతో మంగళవారం పంపిణీ చేశారు. ఎల్లయ్య మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్‌కి దక్కుతుందని అన్నారు.