'పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి'

'పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి'

MNCL: పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. సోమవారం వేమనపల్లి మండలం బద్దంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. పట్టా పుస్తకాలు లేక రైతు భరోసా, రుణాలు పొందలేకపోతున్నారన్నారు.