జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులు
PDPL: రామగుండం ఎన్టీపీసీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎం.ముక్తిశ్రీ, సునీహా సుల్తానా, టీ.పవన్ కుమార్లు జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 14 నుంచి 19 వరకు జరుగనున్న పోటీల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వీరిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.