VIDEO: మొక్కలను సంరక్షించుకోవాలి: మంత్రి పొన్నం

WGL: మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండాలో గ్రామస్తులతో కలిసి మంత్రి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మొక్కలపై అందరూ మక్కువ పెంచుకోవాలని తెలిపారు.