ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
MBNR: జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి చిత్రపటానికి జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం పాలభిషేకం నిర్వహించారు. ఉదండాపూర్ నిర్వాసితులకు బుధవారం పరిహారం అందడంతో అభిషేకం చేసినట్టు వారు వెల్లడించారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, ఉదండాపూర్ గ్రామ సర్పంచ్ శేఖర్ తదితరులున్నారు.