'కూటమి పాలనతో అన్నిచోట్లకు బస్సు సర్వీసులు'

కృష్ణా: నూజివీడు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరం మేరకు కూటమి ప్రభుత్వం రాగానే 19 సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి, హైదరాబాద్ నగరాలతో పాటు గ్రామాలకు బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.