VIDEO: వాడపల్లిలో ఘనంగా స్వామి వారి తెప్పోత్సవం

VIDEO: వాడపల్లిలో ఘనంగా స్వామి వారి తెప్పోత్సవం

కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. స్వామివారికి విశేషార్చన, నిత్య హోమం చేశారు. బుధవారం రాత్రి గౌతమి గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.