గోదావరికి భారీ వరద.. పడవలపై రాకపోకలు
కోనసీమ: నవంబర్ నెలలోనూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. 'మొంథా' తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 3 లక్షల 17 వేల క్యూసెక్కుల మిగులు జలాలను అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో పి. గన్నవరం మండలంలో లంక గ్రామాల ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.