పెద్ద దోర్నాలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ప్రకాశం: పెద్ద దోర్నాలలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. చిన్నా-పెద్దా తేడా లేకుండా కొత్త వస్త్రాలు ధరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మత పెద్దలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సందేశమిచ్చారు.