ప్రశంసా పత్రం అందుకున్న ఎస్సై

GDWL: గట్టు మండలం ఎస్సై కేటీ మల్లేశ్‌కు శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ పత్రాన్ని అందుకున్న ఎస్సై మాట్లాడుతూ.. ఈ ప్రశంసా పత్రం తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కింద పనిచేయడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.