అవినీతి కేసులో ఎక్సైజ్ సీఐ అరెస్ట్
KNR: కరీంనగర్‌లో అర్బన్ ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న రాము అరెస్టు అయ్యారు. గతంలో సిరిసిల్లలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో సీఐ రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.