'ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం'

'ట్రాఫిక్ నియమాలను పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం'

WNP: రక్షాబంధన్ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ కృష్ణయ్య జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వాహనదారులకు మహిళా కానిస్టేబుళ్లు రాఖీలు కట్టీ శుభాకాంక్షలు తెలియజేశారు.