రౌడీయిజంపై ఉక్కుపాదం సురేష్‌కు ఆరు నెలల బహిష్కరణ

రౌడీయిజంపై ఉక్కుపాదం సురేష్‌కు ఆరు నెలల బహిష్కరణ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీయిజాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఇకపై సహించబోమని హెచ్చరిస్తూ, మిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ అలియాస్ కోతి సురేష్‌పై ఆరు నెలల పాటు కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరణ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు.